రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు స్వాగతించారు. ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను హైకోర్టు తీర్పు కాపాడిందని ఆయన అభిప్రాయపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏ తప్పూ చేయకున్నా... కక్షపూరితంగా పదవినుంచి తొలగించారని కళా మండిపడ్డారు. సీఎం జగన్ కక్షపూరిత నిర్ణయాలపై హైకోర్టు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు.
'ప్రజాస్వామ్య వ్యవస్థలను హైకోర్టు తీర్పు కాపాడింది'
ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను హైకోర్టు తీర్పు కాపాడిందని తెదేపా నేత కళా వెంకట్రావు పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏ తప్పూ చేయకున్నా... ప్రభుత్వం కక్షపూరితంగా పదవి నుంచి తొలగించిందని ధ్వజమెత్తారు.
kala venkata rao