తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్.. తన కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. హైకోర్టులో వాదనలు వినిపించారు. పోలీసులు పదేపదే కేసులు పెట్టి ప్రసాద్‌ను హింసిస్తున్నారని కోర్టుకు వివరించారు. ఇసుక మాఫియా అడ్డుకున్నారనే నెపంతో పోలీసులు తన కేసును నీరు కారుస్తున్నారని పిటిషనర్ ఆవేదన చెందారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
శిరోముండనం కేసులో కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం - సీతానగరం శిరోముండనం కేసు తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్.. తన కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించింది.

శిరోముండనం కేసులో కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం