లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తమవంతు సహాయాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ ఆపన్న హస్తం అందిస్తోంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి ఆహార పొట్లాలను అందిస్తున్నారు. 750 ఆహార పొట్లాలను తయారుచేసి కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సిబ్బందికి పంపిణీ చేశారు. రావులపాలెంలోని పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అనిల్ రెడ్డి అనే యువకుడు నాలుగు వందల మంది అభాగ్యులకు, యాచకులకు, నిరాశ్రయులకు భోజనం పెట్టాడు.
ఆపదలో... దాతల దాతృత్వం - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్
లాక్డౌన్ సమయంలో నిరుపేదలు ఉపాధి కోల్పోయారు. తినడానికి తిండి లేక అభాగ్యులు అలమటిస్తున్నారు. ఇలాంటి వారికి బుక్కెడు అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తున్నారు ఎందరో దాతలు.
helping to poor people in east godavari