లాక్డౌన్ కారణంగా పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ.. తూర్పుగోదావరి జిల్లా తునిలో శ్రీవిశ్వకర్మ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన విప్... ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
'స్వర్ణకారుల కుటుంబాలను ఆదుకోవాలి' - తునిలో లాక్డౌన్ ప్రభావం
లాక్డౌన్ కారణంగా పేదలు, కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు స్థానిక స్వర్ణకారులు తమను ఆదుకోవాలని వినతిపత్రం అందించారు.
ప్రభుత్వ విప్ రాజాకు వినతి పత్రం అందజేస్తున్న స్వర్ణకారులు