తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. ఆకాశం మేఘావృతమై.. బలమైన ఈదురుగాలులుతో జోరుగా వర్షం కురిసింది. కోనసీమ నడిబొడ్డున ఉన్న అమలాపురంతో పాటు పి. గన్నవరం, అంబాజీపేట, అయినవెల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం, తదితర మండలాల్లో బలంగా గాలులు వీసి కుండపోతగా వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేద తీరారు.
కోనసీమలో వాతావరణ మార్పు.. కుండపోతగా కురిసిన వర్షం
కోనసీమ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అమలాపురం డివిజన్లో మంగళవారం ఈదురుగాలులుతో కూడిన జోరు వర్షానికి రైతులు హర్షం వ్యక్తం చేయగా.. చల్లగాలికి పట్టణవాసులు సేదతీరారు.
ఈదురుగాలులుతో జోరుగా వర్షం