తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గాదెలపాలెంలో అరుదైన చామదుంప.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే దుంప.. 1.180 కిలోల బరువు ఉండడమే ఇందుకు కారణమవుతోంది. గళ్ళ రత్నాజీ అనే రైతు పెరట్లో మొక్కల మధ్య తవ్వుతుండగా ఈ పెద్ద చామదుంప బయట పడింది. సాధారణంగా చామదుంపలు 250 గ్రాముల లోపే ఉంటాయి. ఇది మాత్రం కిలోకు పైనే ఉంది. ఇంత బరువు ఉండడం అరుదని.. అధికంగా పోషకాలు అందడం వలనే బరువు పెరిగిందని ఉద్యాన వన అధికారి రమేష్ తెలిపారు.
దుంప ఒక్కటే.. బరువు కిలో పైనే..!
ఓ చామదుంప అందరినీ అబ్బురపరుస్తోంది. మహా అయితే వందో.. రెండు వందల గ్రాముల్లోపో ఉండే చామ దుంప.. ఏకంగా కిలోకు పైగా బరువు ఉండడమే ఇక్కడ విశేషం.
పెద్ద చామదుంపను చూపిస్తున్న రైతు