తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కొవిడ్-19 కేసులు 420 దాటేశాయి. అమలాపురం డివిజన్లోని 16 మండలాల్లో కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో గత మూడు రోజులుగా డివిజన్ వ్యాప్తంగా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఈ సమయంలో వారి అవసరాల నిమిత్తం బయటకు వస్తున్న ప్రజల వల్ల రోడ్లపై విపరీతంగా రద్దీ ఏర్పడుతుంది.
అమలాపురం పట్టణంతో పాటుగా రాజోలు, మలికిపురం, జగ్గన్నపేట, రావులపాలెం వంటి ముఖ్య ప్రాంతాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు ఇతర అధికారులు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంతైనా ఉంది.