ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎగసిపడుతున్న అలలు.. తీరప్రాంత ప్రజల ఆందోళన - తూర్పు గోదావరిలో అలల ఉధృతి

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ సముద్ర తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంత మండలాల్లో సముద్రం సుమారు 50 నుంచి 100 మీటర్ల మేర ముందుకు వచ్చింది.

heavy tides in east godavari
తూర్పుగోదావరి తీరంలో ఎగసిపడుతున్న అలలు

By

Published : May 27, 2020, 9:56 AM IST

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ సముద్ర తీర ప్రాంతం ముందుకు చొచ్చుకొచ్చింది. ఇటీవల తుపాను వచ్చినప్పటి నుంచి సముద్రంలో కెరటాల ఉధృతి ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు.

సఖినేటిపల్లి మండలం, అంతర్వేది, పల్లిపాలెం,పోలవరం మండలం, భైరవపాలెం వరకు సముద్రంలో కెరటాలు నాలుగైదు రోజులుగా ఎగసిపడుతున్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలలో సముద్రం 50 నుంచి 100 మీటర్ల మేర ముందుకు వచ్చిందని తీర ప్రాంత ప్రజలు కలవరపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details