తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సాగర తీరంలో సోమవారం అలలు ఎగసిపడ్డాయి. వాటి ధాటికి ఓ దుకాణం కడలిలో కలిసిపోయింది. సమీపంలోని సాగర సంగమం వద్ద సాయంత్రం సముద్రం సుమారు కిలోమీటరు దూరం వెనక్కి వెళ్లింది. నీరు వెనక్కి వెళ్లిన తర్వాత ఇసుక తిన్నెలపై కుంచెతో గీసినట్లు ఏర్పడిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. అమావాస్య రోజున ఆటుపోట్ల తీవ్రత పెరుగుతుందని స్థానికులు తెలిపారు.
రాకాసి అల.. గీసిన కళ..
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సాగర తీరంలో అలలు ఎగసిపడ్డాయి. అలల ధాటికి ఇసుక తిన్నెలపై కుంచెతో గీసినట్లు ఏర్పడిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.
heavy tides at antharvedi coast