ఎండల ప్రభావం... నిర్మానుష్యంగా రాజమహేంద్రవరం - తూర్పుగోదావరి
తూర్పుగోదావరి జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 10 దాటిన తరువాత జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడంలేదు.
నిర్మానుష్యంగా మారిన రాజమహేంద్రవరం
తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. చింతూరు, కిర్లంపూడి, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా.. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనులుంటే తలకు, ముఖానికి రక్షణగా వస్త్రాలు ధరించి ప్రయాణం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రాజమహేంద్రవరం కోటగుమ్మం, పుష్కరఘాట్, గట్టురోడ్డు ఎండల ప్రభావంతో ఖాళీగా మారుతున్నాయి.