తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలు.. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోనూ బ్యాంకుల వద్ద ఖాతాదారులు బారులు తీరారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ ఖాతాలో నగదు తీసుకునేందుకు అధిక సంఖ్యలో బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. ఇప్పటివరకు లాక్డౌన్ సమర్థంగా అమలు చేసిన పోలీసులు.. బ్యాంకుల వద్ద వచ్చే వారిని అదుపు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు.
లాక్డౌన్ ఉన్నా బ్యాంకుల వద్ద జనం బారులు - banks rush in east godavari district
లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నగదు తీసుకునేందుకు తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. వృద్ధులు, వితంతువులు, ఫించనుదారులు ఉదయం నుంచే బ్యాంకులకు క్యూ కట్టారు. అయితే వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.

లాక్డౌన్ ఉన్నా బ్యాంకుల వద్ద జనం బారులు
TAGGED:
banks rush news in ap