తూర్పుగోదావరి జిల్లా యానంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. 24గంటల్లో10సెంటీమీర్ల వర్షపాతం నమోదైంది.స్టేట్ బ్యాంక్,బాలయోగి క్రీడా ప్రాంగణం,డిగ్రీ కాలేజీతో పాటు పులు వీధుల్లో మోకాళ్లలోతులో నీరు నిలచిపోయింది.పిల్లరాయుని ఆలయంలో వర్షం చేరటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.డిప్యూటి కలెక్టర్ శివరాజ్ భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించి,అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు.ముందుగా రహదారులపై నీరును బయటకు పంపించే మార్గాలను చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలతో యానం జనజీవనం అస్తవ్యస్థం - heavy rain news in yanam
తూర్పుగోదావరి జిల్లా యానంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారుల్లో మోకాలి లోతన నీరు నిలచింది.
యానాంలో భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలం