అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తడిసి ముద్దవుతోంది. నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు, ఐ. పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, కాలువలు ఆక్రమణలకు గురవడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
భారీ వర్షాలు.. రహదారులపై నీళ్లు.. తాగునీటికి ఇబ్బందులు - తూర్పుగోదావరి జిల్లా వర్షాలు తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. రోడ్లపై వర్షపునీటితో పాటు మురుగు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇళ్ల మధ్యలో మురుగునీరి చేరి దుర్వాసన వస్తోందంటూ ప్రజలు వాపోతున్నారు.
![భారీ వర్షాలు.. రహదారులపై నీళ్లు.. తాగునీటికి ఇబ్బందులు heavy rains in mummidivaram constituency east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8834912-479-8834912-1600340860750.jpg)
వాన నీటిలోనే మంచి నీరు పట్టుకుంటున్న మహిళ