నెల్లూరు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నెల్లూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెంలో వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. నెల్లూరులోని అండర్ బ్రిడ్జిలో వర్షపు నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. జిల్లాలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతుండటంతో నూర్పిడి చేసిన ధాన్యం పొలాల్లోనే ఉంది. ధాన్యం తడిసిపోతుందని రైతులు భయపడుతున్నారు.
Rains : పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. రహదారులు నీట మునగడంతో రాపపోకలకు అంతరాయం ఏర్పడింది. రంపచోడవరం మన్యంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో భూపతిపాలెం జలాశయం వద్ద మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న కొండలపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉదయం ఎనిమిది గంటలు దాటిన కొండలపై పొగమంచు వీడలేదు.
ఇదీ చదవండి: Fraud: రైటర్ బిజినెస్ సర్వీసెస్ పేరుతో 1.26 కోట్ల ఘరానా మోసం