ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో ఉదయం నుంచి కుండపోత వర్షం - తూర్పుగోదావరిలో కుండపోత

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కోనసీమ చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పంట నీటమునగగా.. మళ్లీ ఈరోజు ఉదయం నుంచి కుండపోతగా వాన పడుతూనే ఉంది. వరుణుడి మొన్నటి దెబ్బకు లోతట్టు ప్రాంతాలు ఇంకా కోలుకోక ముందే.. మరోసారి విరుచుకుపడింది.

heavy rains in konaseema
కోనసీమలో జోరు వానలు

By

Published : Oct 17, 2020, 10:03 PM IST

ఉదయం 11 గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. నాలుగు రోజుల కిందటి భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. మరోసారి వరుణుడి ప్రతాపానికి కోనసీమ వణికిపోతోంది.

అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, పి గన్నవరం మండలాల్లో కారుమబ్బులు కమ్ముకుని జోరుగా వర్షం పడుతోంది. పంటల పరిస్థితి ఏమిటోనని రైతులు తలలుపట్టుకుని కూర్చున్నారు.

ఇదీ చదవండి:భారీ వర్షానికి నీటమునిగిన జీసీసీ గోదాములు- తడిచిన నిత్యావసరాలు

ABOUT THE AUTHOR

...view details