ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోనసీమలో కుండపోత.. ముంపు బారిన వరిచేలు

By

Published : Nov 26, 2020, 2:09 PM IST

తూర్పు గోదావరి జిల్లాపై నివర్ తుపాను ప్రభావం పడింది. కోనసీమలో కుండపోత వర్షం పడుతోంది. వరి చేలు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులకు పంట పడిపోయింది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించింది.

rains in konaseema
కోనసీమలో వర్షానికి తడిసిన వరిచేలు

తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గత రాత్రి నుంచి కుండపోత వర్షం పడుతోంది. వరి చేలు ముంపు బారిన పడ్డాయి. కోతలు పూర్తై పొలంలో వేసిన ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. పొలంలోని నీటిని బయటకు పంపేందుకు రైతులు శ్రమిస్తున్నారు. కోనసీమలో 90 శాతం మంది రైతులు ఖరీఫ్ లో వరి సాగు వేశారు. ప్రస్తుతం 30 శాతం కోతలు పూర్తయ్యాయి. మిగిలినవి ఇంకా కోయలేదు. తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు, ఈదురు గాలులకు పంట పాడైపోతుందేమో అని అన్నదాతలు భయపడుతున్నారు.

యానాంలో లోతట్టు ప్రాంతాలు జలమయం

కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. యానాం పర్యటనలో ఉన్న పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు తాజా పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఇవీ చదవండి:

గుంటూరు జిల్లాలో చిరుజల్లులు.. ఈదురుగాలులు

ABOUT THE AUTHOR

...view details