తూర్పు గోదావరి జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో భారీగా వర్షం పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఐఎల్టీడీ జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డు, డీలెక్స్ సెంటర్ తదితర రహదారుల పైకి మురుగు నీరు పొంగిపొర్లింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజమహేంద్రవరం గ్రామీణంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కడియం, మండపేట, రావులపాలెం, పి.గన్నవరం తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
రాజమహేంద్రవరంలో భారీ వర్షం... పొంగి పొర్లిన మురుగు నీరు - rain news in rajamahendravaram
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కురిసిన భారీ వర్షానికి... రహదారులపై మురుగునీరు పొంగిపొర్లింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాజమహేంద్రవరంలో భారీ వర్షం