ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాలు గలగల... రిజర్వాయర్లకు జలకళ..! - ఏపీలో జలాశయాలు

రాష్ట్రంలో కుండపోత వర్షాలకు జలాశయాలు నిండిపోతున్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరువయ్యాయి. కొన్ని చోట్ల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాల కారణంగా కోనసీమ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది.

heavy-rains-in-andhrapradesh

By

Published : Oct 22, 2019, 5:38 PM IST

Updated : Oct 22, 2019, 11:24 PM IST

నిండుకుండలా మారిన జలాశయాలు

విశాఖపట్నం,తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కరుస్తున్నాయి.కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జలశయాలు పూర్తిస్థాయిలో నిండిపోయాయి.విశాఖలోని తాండవ జలాశయ నీటిమట్టం380అడుగులు కాగా ప్రస్తుతం365అడుగులకి నీరు చేరుకుంది. గడచినఐదేళ్లతో పోలిస్తే నీటిమట్టం గణనీయంగా పెరిగింది.ఈ జలాశయం ద్వారా52వేల ఎకరాల భూమి సాగవుతోందని...నీరు పుష్కలంగా ఉండటంతో వచ్చే ఏడాదికి సైతం నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.మాడుగుల నియోజకవర్గంలోని జలాశయాలు సైతం ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.పెద్దేరు,కోనాం,రైవాడ జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంత ప్రజలు కుండపోత వర్షాలకు వణికిపోతున్నారు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమై వాహనచోదకులు ఇక్కట్లు పడుతున్నారు.వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Last Updated : Oct 22, 2019, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details