తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మోస్తారు వర్షం కురిసింది. రంపచోడవరంలోని మన్యంలో వీచిన ఈదురు గాలులు, భారీ వర్షంతో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి సరఫరా నిలిచిపోయింది. రంపచోడవరంతో పాటు మారెడుమిల్లి, అడ్డతీగల, గంగవరం, రాజావొమ్మంగి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో తాడిచెట్లపై పిడుగులు పడ్డాయి.
భారీ వర్షాలు... పిడుగుపాటుకు చెట్లు దగ్ధం - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ప్రత్తిపాడు మండలంలో పిడుగులు పడి తాడిచెట్లు కాలిపోయాయి. రంపచోడవరం మన్యంలో వీచిన ఈదురుగాలులతో వృక్షాలు నేలకూలాయి.
భారీ వర్షాలు... పిడుగుపాటుకు చెట్లు దగ్ధం