తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో శుక్రవారం కురిసిన వర్షానికి పలు లోతట్టు గ్రామాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా రంపచోడవరంలో నిత్యావసర సరకులు నిల్వ చేసే గోదాముల్లో బియ్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. సీత పెళ్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మన్యంలో భారీ వర్షం.. కష్టాల్లో లోతట్టు గ్రామాలు - మన్యంలో భారీ వర్షం
వర్షబీభత్సం కొనసాగుతూనే ఉంది. రంపచోడవరం మన్యంలో కురిసిన వర్షానికి లోతట్టు గ్రామాలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మన్యంలో భారీ వర్షం