తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్దపెద్ద వృక్షాలు నేలకొరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున రంపచోడవరం-మారేడుమిల్లి ప్రదాన రహదారిలో దేవరపల్లి గ్రామం వద్ద భారీ వృక్షం నేలరాలింది. దీంతో అటువైపుగా రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆర్ అండ్ బి అధికారులకు సమాచారం అందించినా..ఎవరూ రాకపోవడంతో స్థానికులే చెట్టును తొలగించే పనిలోపడ్డారు.
వర్షంతో నేలరాలిన భారీ వృక్షం..రాకపోకలకు అంతరాయం
గత మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద పెద్ద చెట్లు నేలరాలాయి.
heavy rain