తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. పొలాల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఖరీఫ్ కోసం పెట్టిన నారుమళ్లు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో తమకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. అమలాపురం, పీ.గన్నవరం, సఖినేటిపల్లి, మామిడికుదురు, రాజోలు, ముమ్మిడివరం, అంబాజీపేట, అల్లవరం, అయినవిల్లి మండలాల్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కోనసీమలో కుండపోత వర్షం.. నీట మునిగిన నారుమళ్లు
కోనసీమలో కురుస్తున్న వర్షానికి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగు కోసం పెట్టిన నారుమళ్లు పూర్తిగా నీటమునిగాయి. చాలా మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కోనసీమలో భారీ వర్షాలు