తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మండలంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంపచోడవరం, జగ్గంపేట, రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారులపై చెట్లు కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక నాయకుల చొరవతో చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
గోకవరంలో ఈదురుగాలుల బీభత్సం - gokavaram mandal news today\
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మండలంలో మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం వాటిల్లింది.
గోకవరంలో ఈదురుగాలుల బీభత్సం