ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారు మడులను నీట ముంచిన ఎడతెరపి లేని వాన - తూర్పు గోదావరి వర్షం న్యూస్

తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పలు చోట్ల నారు మడులు మునిగిపోయాయి. రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

heavy-rain-in-east-godavari
నీటి మునిగిన నారు మడులు

By

Published : Jul 15, 2020, 11:09 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలు... ఖరీఫ్ వరి సాగుకు ఇబ్బందిగా మారాయి. జిల్లాలో 2 లక్షల 23 వేల హెక్టార్లలో వరి సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు.

ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో 1,189 హెక్టార్ల వరి నాట్లు ముంపుబారిన పడినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఇదే విధంగా వర్షం కురిస్తే... నారు మడలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details