Iతూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఈదురుగాలులతో కూడిన బారీ వర్షం కురిసింది. లంకప్రాంతాల్లోని అరటి చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలులకు విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం - rain news in athreyapuram
వాతావరణంలో మార్పుల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వర్ష బీభత్సనికి ధ్వంసమైన అరటి చెట్లు
రంపచోడవరంలో ఏజెన్సీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడికి అల్లాడిన ప్రజలు సాయంత్రం వడగళ్ల వర్షంతో ఊరట చెందారు.