తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురస్తున్న వర్షానికి కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వర్షం నీరు చేరింది. భారీ వర్షం కారణంగా ముఖ మండపం, ఆలయ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆప్రాంతాల్లో ఉన్న హుండీల్లోకి సైతం నీరు చేరింది.
వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలోకి చేరిన వర్షపు నీరు - rain news east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది.
వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలోకి చేరిన వర్షపు నీరు
ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు విషయం తెలుసుకుని సిబ్బందితో నీటిని బయటకి తోడించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో హుండీలను తెరిచి నోట్లను భద్రపరిచారు. వాటిని లెక్కించగా రూ.1,98,904 ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు.