ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో వర్షాలు... ఉపశమనం పొందిన ప్రజలు

తుఫాను ప్రభావం... వాతావరణంలో మార్పులతో తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్ష ప్రభావంతో జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లోన్నీ నీటమునిగాయి.

By

Published : Jun 4, 2020, 12:06 PM IST

heavy rain fall in the state
రాష్ట్రంలో వర్షాలు

తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో భారీ వర్షం కురిసింది. ఉదయం 8గంటల వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా గాలులతో కూడిన భారీ వర్షంతో చల్లబడింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైన నీరు చేరడంతో పార్కింగ్​లో ఉంచిన వాహనాలు నీటమునిగాయి.

  • పశ్చిమ గోదావరిలో..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కొద్ది రోజులుగా రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణం చల్లబడచడంతో ప్రజలు ఉపశమనం పొందారు.

  • విశాఖలో...

విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అవస్థలు పడుతున్న ప్రజలకు... వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. అధిక వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన లింగాల కాలనీ, బృందవనం, ప్రశాంతి నగర్, ఇంద్రా కాలనీల్లో వర్షపు నీరు నిలిచింది.

ఇదీ చదవండి:

పరువు తీసేశారు... ప్రాణం వదులుతున్నా.!!

ABOUT THE AUTHOR

...view details