తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో కురిసిన భారీ వర్షాలతో కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో రంప, పందిరిమామిడి, ఐ పోలవరం, వేములకొండ, వాడపల్లి వెళ్లే రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భూపతిపాలెం జలాశయం వద్ద కొండచరియలు విరిగి పడటంతో రెండు గంటల పాటు రవాణా స్తంభించింది. రోడ్లు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి వాటిని తొలగించారు.
మన్యంలో కుండపోత వర్షం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కొండవాగు - కొండవాగు ఉద్ధృతం
రంపచోడవరంలో కురిసిన వర్షాలకు కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సమీప కొండచరియలు విరిగిపడుతున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
![మన్యంలో కుండపోత వర్షం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కొండవాగు heavy rain at rampachodawaram east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9238905-576-9238905-1603139055965.jpg)
కొండవాగు ఉద్ధృతం