ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టు కొంచెం... కాయ ఘనం - east godavari district palm crope news update

నిండా కాయలతో కళకళలాడుతూ.. అందరినీ కనువిందు చేస్తోంది. అంత ఎత్తు లేకపోయినా.. ఉన్నంతలోనే కొండంత కాపు కాసి.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని పనస చెట్టు. వేసిన ఏడాదిలోపే మంచి కాపు కాసే.. ఇలాంటి చెట్లను అభివృద్ధి చేస్తే బాగుంటుందని అందరికీ అనిపిస్తోంది.

palm tree
palm tree

By

Published : Apr 23, 2021, 2:30 PM IST

తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న పనస చెట్టు అందరినీ ఆకట్టుకుంటోంది. నిండా కాయలతో ఎంతో ఆకర్షణగా దర్శనమిస్తొంది. ఏడాదిలోనే తొలి కాపు కాసిందని యజమాని తెలిపారు. సాధారణంగా పనస చెట్టు.. ఎత్తుగా.. భారీ పరిమాణంలో ఉంటుంది. ఈ మొక్క మాత్రం ఎత్తు అంతగా లేకపోయినప్పటికీ.. మొదలు భాగంలోనే సుమారు యాభైకు పైబడి కాయలు కాసింది. ఇవ్వన్ని ఒకదానినొకటి ఆనుకొని రావటంతో.. చెట్టు నిండుగా కనిపిస్తూ.. కనువిందు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details