గోదావరి నదికి వరద నీరు పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని లంక రైతుల్లో.. ఈ వరద ఆందోళన పెంచుతోంది. ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల వరద నీరు గోదావరిలోకి భారీగా చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వరద నీటిని విడిచిపెడుతున్న పరిస్థితుల్లో... కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం మండలంలోని గౌతమి, వశిష్ఠ రెండు వంతెనల వద్ద గోదావరి ఉరకలు వేస్తోంది.
గోదావరికి భారీగా వరద... ఆందోళనలో లంక రైతులు - గోదావరి
ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవటం వల్ల వరద నీరు గోదావరిలోకి ఎక్కువగా వచ్చి చేరుతోంది. మరింత వరద పెరిగితే లంక పొలాలన్నీ నీట మునుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గోదావరికి భారీగా వరదనీరు
TAGGED:
గోదావరి