తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదికి వరద క్రమంగా పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా నీరు చేరుకుంటోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గురువారం ఉదయం 10.6 అడుగులు నీటిమట్టం ఉండగా.. 75 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు నుంచి తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో గోదావరికి వరద వస్తోంది. రాజమహేంద్రవరం వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.6 అడుగుల నీటి మట్టం నమోదైంది.
గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వరద