తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో కొనసాగుతున్న వరద ఉద్ధృతికి ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుపై వరద...లారీ కింద వంట
By
Published : Aug 9, 2019, 3:09 PM IST
లారీ డ్రైవర్ల వెతలు
గోదావరి, శబరి నదులకు పోటెత్తిన వరద నీటి ఉద్ధృతికి తూర్పుగోదావరి విలీన మండలాలు అతలాకుతలం అవుతున్నాయి. గత పదిరోజులుగా రహదారులపై వరద నీరు భారీ ఎత్తున నిలిచి ఉండిపోవటంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. ఛత్తీస్ఘడ్, ఒరిస్సాల నుంచి రాకపోకలు సాగించే లారీలు వరద కారణంగా రోడ్లపైనే నిలిపేశారు. దీని వల్ల లారీ డ్రైవర్లు, క్లీనర్లు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు. వెంట తెచ్చుకున్న బియ్యం, నిత్యావసర సరుకులు ఖాళీ అవ్వటంతో రెండు, మూడు రోజుల నుంచి తినటానికి తిండి లేక, తాగటానికి నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నా, అధికారులు ఎవరూ రాలేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని అంతర్రాష్ట్ర లారీ డ్రైవర్లు కోరుతున్నారు.