ఓటు వివరాలు తెలుసుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గడియార స్తంభం వద్ద.. భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని అమలాపురం మున్సిపల్ కమిషనర్ వీవీఐపీ నాయుడు కోరారు. ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉందో.. వివరాలతో కూడిన సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలుగా వెబ్సైట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించేందుకు అమలాపురం గడియార స్తంభం వద్ద భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వెబ్సైట్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. పోలింగ్ కేంద్రంతో సహా సమగ్ర వివరాలు సులువుగా తెలుసుకోవచ్చునని.. ఫ్లెక్సీ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
ఓటు వివరాలు తెలుసుకునేందుకు.. ఫ్లెక్సీ ఏర్పాటు! - అమలాపురం మున్సిపల్ ఎన్నికలు వార్తలు
పురపాలక ఎన్నికల్లో పట్టణవాసులు ఓటు వివరాలు తెలుసుకునేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో.. అమలాపురంలో ఓటు వివరాలు తెలుసుకునేందుకు వెబ్సైట్ వివరాలను తెలుపుతూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ఫ్లెక్సీ