ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమ తిరుపతిలో భక్తుల తాకిడి - కోన సీమ తిరుపతిలో భక్తుల తాకిడీ

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కరోనా కారణంగా నిలిపివేసిన బస్సు సర్వీసులను తిరిగి పునర్ధురించగా.. భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆలయం గోవింద నామస్మరణతో మరు మోగుతోంది.

heavy croud in vadapalli temple
కోన సీమ తిరుపతి

By

Published : Oct 3, 2020, 5:36 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం... వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. ఏడు శనివారాల నోము నోచుకున్న వారితో పటు.. సాధారణ భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ వారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది.

కొవిడ్ నియంత్రణలో భాగంగా నిలిపివేసిన ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. వీక్షకులందరూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ.. నిబంధనలు పాటించే విధంగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details