ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వ్యాప్తితో హడలిపోతున్న అయినవిల్లి - అయినవిల్లిలో రెడ్ జోన్లు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలో కొవిడ్ కోరలు చాస్తోంది. మండలంలో 16 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Heavy corona cases increase in ayinavilli mandal east godavari district
కరోనా వ్యాప్తితో హడలుతున్న అయినవిల్లి

By

Published : Jun 6, 2020, 4:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయినవిల్లి గ్రామంలో నాలుగు, శంకరాయగూడెంలో అయిదు, నేదునూరు పెద్దపాలెంలో ఏడు కేసులతో మండలంలో మొత్తం కేసుల సంఖ్య 16కు చేరింది. అమలాపురం ఆర్​డీఓ బీహెచ్ భవానిశంకర్ ఈ గ్రామాలను సందర్శించి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details