తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సర్వే చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు బృందాలుగా ఏర్పడి ప్రజల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.
కోనసీమలో ఇంటింటి ఆరోగ్య సర్వే
కరోనా నియంత్రణకై తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య స్థితిగతులపై ఇంటింటా జోరుగా సర్వే చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు బృందాలుగా ఏర్పడి ప్రజల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.
కోనసీమ వ్యాప్తంగా 16 మండలాల్లో సుమారు మూడున్నర లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ విధానంలో సర్వే చేస్తున్నారు. ప్రజల నుంచి కరోనా, డెంగ్యూ, మలేరియా మూడు వ్యాధుల ప్రాథమిక లక్షణాల వివరాలను సేకరిస్తున్నారు. తెలుసుకున్న సమాచారాన్ని అక్కడినుంచే ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. అమలాపురం డివిజన్వ్యాప్తంగా 10 ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. అమలాపురం ఏరియా ఆసుపత్రి, ముమ్మిడివరం సామాజిక ఆసుపత్రి, నాగుల్ లంక, లక్కవరం, తాటిపాక ఆవిడి, ఊబలంక, గోడిలంక, కాట్రేనికోన, కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇకనుంచి ప్రతిరోజు కరోనా పరీక్షలు చేస్తామని అమలాపురం డివిజన్ అడిషనల్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిహెచ్. పుష్కర రావు వెల్లడించారు.
ఇదీచూడండి.కాకినాడలో గ్యాస్ లీక్ కలకలం