ఆరోగ్య రక్షణపై హెడ్ కానిస్టేబుల్ అద్భుతమైన పాట..! - అనపర్తి పోలీస్ స్టేషన్ వార్తలు
లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వస్తూనే ఉంటారు కొందరు. అలాంటి వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఓ హెడ్ కానిస్టేబుల్ వినూత్న ప్రయత్నం చేశారు. మాటలతో వినటం లేదని పాటతో సూచనలు ఇచ్చారు.
head constable song on health
By
Published : May 6, 2020, 6:46 PM IST
ఆరోగ్య రక్షణపై హెడ్ కానిస్టేబుల్ అద్భుతమైన పాట
కరోనా విజృభిస్తున్న తరుణంలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిప్పాడ రుద్రబాబు ఓ గీతాన్ని రూపొందించారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అందులో సూచించారు. రాజమహేంద్రవరంలో ఏఎస్సైగా పని చేస్తున్న సత్యనారాయణ దీనిని ఆలపించగా... అనపర్తి సీఐ భాస్కరరావు విడుదల చేశారు.