ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో హెడ్​ కానిస్టేబుల్​ మృతి - రోడ్డు ప్రమాదాలు తాజా వార్తలు

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ హెడ్​ కానిస్టేబుల్​ను టిప్పర్​ ఢీకొట్టంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో చోటు చేసుకుంది.

head constable died in road accident
రోడ్డు ప్రమాదంలో హెడ్​ కానిస్టేబుల్​ మృతి

By

Published : Mar 14, 2021, 8:34 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. జెద్దంగిలో విధులు నిర్వర్తిస్తున్న సూరిబాబు అనే హెడ్​ కానిస్టేబుల్​ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ప్రత్తిపాడు సీఐ రాంబాబు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details