తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఇళ్ల స్థలాల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. పేదలకు కేటాయించిన స్థలంలో ఇళ్లు నిర్మిస్తే వ్యవసాయ భూములు మునిగిపోతాయని పిటిషనర్ తన వాదనను న్యాయస్థానం ముందుంచారు. ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ... భూములు చదును చేయట్లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..ప్రస్తుత పిటిషన్‌ను ప్రజాప్రయోజన వ్యాజ్యంతో జతచేయాలని ఆదేశించింది. అనంతరం వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడుతామని న్యాయస్థానం కేసును వాయిదా వేసింది.
'పేదలకు ఇళ్లు నిర్మిస్తే... వ్యవసాయ భూములు మునిగిపోతాయి' - 'పేదలకు ఇళ్లు నిర్మిస్తే... వ్యవసాయ భూమలు మునిగిపోతాయి'
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఇళ్ల స్థలాల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం... వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడుతామని కేసును వాయిదా వేసింది.
'పేదలకు ఇళ్లు నిర్మిస్తే... వ్యవసాయ భూమలు మునిగిపోతాయి'
కాగా... బూరిగపూడిలో 600 ఎకరాల ఆవ భూములకు అధిక ధరలు వెచ్చించారని గతంలోనే పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం అధిక ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.