ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ చెట్టు వేర్లు చూశారా? - ఈ వృక్షపు వేర్లు చూశారా?

ఏ చెట్టు కైనా వేర్లు చూస్తే చిన్నవిగా ఉంటాయి అనుకుంటాం. అటువంటిది ఒక భారీ వృక్షం వేర్లు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఈ వింతైన చెట్టు.. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని లొల్ల లాకుల వద్ద ఉంది.

east godavari district
ఈ వృక్షపు వేర్లు చూశారా?

By

Published : Jun 10, 2020, 6:50 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని బొబ్బర్లంక ప్రధాన రహదారిపై ఉన్న లొల్ల లాకుల గ్రామంలో.. అతిపెద్ద మామిడి వృక్షం ఉంది. కాలువ పక్కనే ఈ వృక్షం అందరినీ ఆకర్షిస్తోంది. వేసవి కాలం వచ్చేసరికి కాలువలకు నీరు విడుదల నిలిపివేయగా.. ఈ మామిడి వృక్షం వేర్లు బయటకు కనిపిస్తున్నాయి.

కాలువ ప్రవహిస్తున్న సమయంలో ఆ చెట్టు ఒక పక్క భాగం మట్టి పూర్తిగా కొట్టుకొని పోవడంతో పూర్తిగా వేర్లు బయటపడ్డాయి. ఫలితంగా ఆ చెట్టు వేర్లు బయటికి కనిపిస్తున్నాయి. ఆ వేర్లు చూస్తుంటే చెట్టు కొమ్మలా అనిపిస్తోంది. ఒక చిన్న వృక్షం మొదలు ఏ విధంగా ఉంటుందో ఈ చెట్టు వేర్లు అదేవిధంగా కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details