ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Veerullamma Temple News: వీరుళ్లమ్మ అమ్మవారికి వైభవంగా హరిద్రాభిషేకం - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

Veerullamma Temple: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కొలువై ఉన్న శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో హరిద్రాభిషేకం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు.. స్వయంగా అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం చేశారు.

అనపర్తిలో అమ్మవారికి వైభవంగా హరిద్రాభిషేకం
అనపర్తిలో అమ్మవారికి వైభవంగా హరిద్రాభిషేకం

By

Published : Jan 7, 2022, 7:18 PM IST

శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో హరిద్రాభిషేకం

Veerullamma Temple News: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో హరిద్రాభిషేకం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు గోదావరి నదీ జలాలను సేకరించారు. గ్రామ పురవీధుల్లో సుమారు 1,008 కలశాలను తలపై ధరించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.

అనంతరం మహిళలు కలశాల్లో హరిద్రాన్ని కలిపి వారే స్వయంగా అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వహించిన హరిద్రాభిషేకం కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.


ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details