కాపు రిజర్వేషన్లపై హరిరామజోగయ్య పోరాటం.. రేపు పాలకొల్లులో నిరాహారదీక్ష - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
11:31 January 01
ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనన్న హరిరామజోగయ్య
Former MP Hariramazogaiah About Kapu Reservations: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్లపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినా స్పందన లేకపోవడతో.. రేపు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. పోలీసులు దీక్షకు అనుమతి ఇవ్వలేదన్న హరిరామజోగయ్య.. ఎలాగైనా దీక్ష చేస్తానన్నారు. పోలీసులు దీక్షను భగ్నం చేసినా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లినా.. అక్కడే నా పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని హరిరామజోగయ్య తేల్చి చెప్పారు.
ఇవీ చదవండి