ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బతుకు బండికి కరోనా గండి! - ఏపీలో లాక్‌డౌన్‌ వార్తలు

బతుకు బండికి... కరోనా గండి కొడుతోంది. చేతి వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారి జీవనోపాధిని దెబ్బతీస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా నెలరోజులుగా పనుల్లేక చేనేతలకు రోజువారి జీవనం రాకుండా పోయింది. రోజురోజుకూ వారి ఆర్థిక పరిస్థితి దుర్భరమవుతోంది.

handloom-workers-are-in-serious-trouble-with-lock-down
handloom-workers-are-in-serious-trouble-with-lock-down

By

Published : Apr 28, 2020, 2:57 PM IST

బతుకు బండికి కరోనా గండి!

లాక్​డౌన్... తూర్పు గోదావరి జిల్లాలోని నేతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది. షాపింగ్ మాల్స్, దుకాణాల్లో వ్యాపారంపై ఆధారపడి వీరంతా అదే రంగంపై ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం అవన్నీ మూతపడిన కారణంగా పొట్టకూటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా తమకు నెలరోజులుగా ఉపాధి లేదని వారు వాపోతున్నారు. పనుల్లేక తీవ్ర కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న నేతన్నలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details