ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపులోనే లంక గ్రామాలు - haevy flood at east godavari

ఎగువ రాష్ట్రాల్లో వరదలు తగ్గినా గోదావరి ఉద్ధృతి తగ్గటం లేదు. ఇప్పటకీ 12 మండలాలు ముంపు బారినే ఉన్నాయి.

ముంపులోనే లంక గ్రామాలు

By

Published : Sep 11, 2019, 10:07 AM IST

ముంపులోనే లంక గ్రామాలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో వరదల కారణంగా గోదావరకి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో వరదలు శాంతించినా, గోదావరి శాంతించక ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. కోనసీమలో ఇప్పటకీ 12 మండలాలకు సంబంధించిన 36 లంక గ్రామాలు ముంపులోనే మగ్గుతున్నాయి. జీ.పెదపూడి అప్పనపల్లి, వెదురు బీడు, చాకలిపాలెం వద్ద కాజ్​వేలు మునిగిపోవటంతో గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. నిత్యావసర సరుకులైనా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని లంక గ్రామస్తులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details