తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం తూరంగిలో గుట్కా, ఖైనీని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నామని డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. గురువారం అర్ధరాత్రి ఒడిశా నుంచి అక్రమంగా లారీలో తీసుకొచ్చిన గుట్కాను తూరంగి గోడౌన్లో దింపుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఇంద్రపాలెం ఎస్సై నాగార్జునరాజు దాడి చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. అందులో సుమారు. 7 లక్షల గుట్కా ప్యాకెట్లు ఉన్నాయని.. వాటి విలువ రూ. 35 లక్షలు ఉంటుందని తెలిపారు. రూ. 21వేల నగదు, లారీ, ఆటో స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
రూ. 35 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టివేత - తూరంగిలో గుట్కా లారీ స్వాధీనం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా తూరంగిలో సుమారు రూ. 35 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తీసుకొచ్చిన ప్యాకెట్లను గోడౌన్లో దింపుతుండగా పట్టుకున్నారు.

గుట్కా లారీ స్వాధీనం