రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో 1650 మంది అధ్యాపకులు పీజీటీ, పీఈటీ, పీడీ, ఆర్ట్, క్రాఫ్ట్ విభాగాల్లో 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని షెడ్యూల్డ్ తెగల పొరుగు సేవల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చోడి నరేష్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 18 నుంచి సెలవులు ప్రకటించగా, జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉన్నా.. నేటికీ తరగతులు ప్రారంభం కాలేదన్నారు. ఈ కారణంగా.. తమకు వేతనాలు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. కనీసం జూన్ నుంచి అయినా తమకు వేతనాలు అందించి ఆదుకోవాలని కోరారు.
'వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం' - కరోనాతో ఏపీలో జీతాలపై ప్రభావం న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న బోధన సిబ్బంది.. వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని షెడ్యూల్డ్ తెగల పొరుగు సేవల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చోడి నరేష్ విజ్ఞప్తి చేశారు.

gurukula's outsourcing teachers facing financial problems