ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో గుణ 369 చిత్రబృందం సందడి - movie unit

రాజమహేంద్రవరంలోని దేవి మల్టీఫ్లెక్స్ థియేటర్లో గుణ 369 చిత్ర బృందం సందడి చేసింది. చిత్ర విజయంపై ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు.

గుణ చిత్రబృందం

By

Published : Aug 10, 2019, 12:45 AM IST

నగరంలో గుణ 369 చిత్రబృందం సందడి

గుణ 369 చిత్రం హీరో కార్తికేయ, హీరోయిన్‌ అనఘా, దర్శకుడు అర్జున్‌ జంధ్యాల, హాస్యనటుడు మహేష్‌ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సందడి చేశారు. ఆర్‌ఎస్స్‌ 100 తర్వాత తనకు అంతటి ఘనవిజయం అందించిన చిత్రం గుణ369 అని హీరో కార్తికేయ అన్నారు. దర్శకుడు తొలిచిత్రమైనా చక్కగా చిత్రీకరించారన్నారు. తెలుగులో తన తొలిచిత్ర విజయవంతం కావడం సంతోషంగా ఉందని హీరోయిన్‌ అనఘా తెలిపారు. గుణ 369 చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనిదని దర్శకుడు అర్జన్‌జంధ్యాల చెప్పారు. తన తర్వాత చిత్రం కూడా కార్తికేయతోనే ఉంటుందని పేర్కొన్నారు. గుణ చిత్రంలో తనది వైవిధ్యభరితమైన క్యారెక్టర్‌ అని హాస్యనటుడు మహేష్‌ అన్నారు. చిత్ర బృందాన్ని చూసేందుకు, వారికి స్వీయచిత్రాలు దిగేందుకు ప్రేక్షకులు పోటీ పడ్డారు.

ఇది కూడా చదవండి.

కోనసీమలో తీవ్ర పంట నష్టం

ABOUT THE AUTHOR

...view details