తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో.. భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తుల వారికి వైకాపా నేతల ఆధ్వర్యంలో నిత్యావసరాల సరకులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వనిత.. పేదలకు వాటిని అందజేశారు. 5 రోజుల పాటు సుమారు 10 వేల మందికి పంచుతామని మంత్రులు తెలిపారు.
రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం నియోజకవర్గాల్లో సరకులు పంపిణీ చేయనున్నారని తెలిపారు. వైకాపా సమన్వయకర్త శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మంత్రులు స్పష్టం చేశారు.