కరోనా.. బడి పంతుళ్లను బతకలేని స్థితికి తీసుకొచ్చింది. మహమ్మారి.. వారి జీవితాలను చిదిమేసింది. మళ్లీ ఎప్పుడు స్కూళ్లు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితిలో దయనీయంగా రోజులు గడుపుతున్నారు. ఇందులో ప్రైవేటు ఉపాధ్యాయులది దీన గాథనే చెప్పాలి.
ఇటువంటి తరుణంగా.. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని సత్యసాయి సేవా సంస్థ తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 40 మందికి నిత్యావసర సరకులను పంపిణీ చేసింది. రావులపాలెం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గొలుగూరి సత్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు సరుకుల కిట్లను అందించారు.