ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పచ్చజెండా - ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌

ఎన్నోఏళ్లుగా ఊరిస్తున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మళ్లీ కదలిక వస్తోంది. తాజాగా టెండర్లకు సన్నాహాలు చేస్తుండటంతో..చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న వారిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పచ్చజెండా
ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పచ్చజెండా

By

Published : Oct 11, 2020, 4:16 AM IST

160 కిలోమీటర్ల సాగరతీరం కల్గిన తూర్పుగోదావరి జిల్లా... కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌, పల్లెపాలెం మైనర్‌ ఫిషింగ్‌ హార్బర్లతో మత్స్యకారులకు వరప్రదాయినిగా ఉంది. వీటికితోడు ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి.... కేంద్ర మత్స్యశాఖ నాబార్డుతో సంయుక్త ఒప్పందానికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం...దీనికి అయ్యే వ్యయాన్ని పెంచింది. గతంలో 350కోట్ల రూపాయలు ప్రతిపాదించగా..ప్రస్తుతం దాన్ని 422 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జిల్లాలో ఏటా...4లక్షల టన్నుల మత్స్యసంపద ఉత్పత్తి అవుతోంది. ఉప్పాడలో హార్బర్‌ అందుబాటులోకి వస్తే ఏటా మరో లక్ష టన్నుల మత్స్యసంపద పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం నిల్వ సామర్థ్యం, ప్రాసెసింగ్‌ వసతులు లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులు... ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ పూర్తైతే ఎంతో మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని మత్స్యకారులు కోరుతున్నారు. మూడేళ్లలో ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే..2వేల500 బోట్లకు బెర్త్ సౌకర్యంతో పాటు..12వేల మంది మత్స్యకారులు లబ్ధి పొందనున్నారు.

ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details